రాధా రెక్కీ వ్యాఖ్యలపై మంత్రి సీరియస్
- VOICE OF HERALD

- Jan 2, 2022
- 1 min read
తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ చేసిన రెక్కీ వ్యాఖ్యలతో రాజాకీయ పెనుదుమారానికి దారి తీసింది ఈరోజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు రెక్కీ కి సంబంధించి వంగవీటి రాధా దగ్గర ఆధారాలు ఉంటే వాటిని బయట పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి డిమాండ్ చేశారు, ఇప్పటివరకు పోలీసులకు ఏదయినా పిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు, రాధా రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు మాటలు వింటున్నారని ఆయన అన్నారు, తమ ప్రభుత్వం గన్ మెన్ లను పంపితే వారిని వెనక్కి పంపటం పై ఆయన మండిపడ్డారు, రాజకీయాల్లో దాదాపు వంగవీటి రాధను మరిచిపోయారని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు, తన తండ్రి హత్యా టీడీపీ హయాంలో జరింగిందని కానీ నేడు వంగవీటి రంగా అదే పార్టీతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని వారి సూచనలు సలహాల మేరకే వైసీపీ పై బురద చాల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.



Comments