top of page

హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఇళ్ల తొలగింపు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 27, 2022
  • 1 min read

హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఇళ్ల తొలగింపు

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


హై కోర్టు ఉత్తర్వుల మేరకే వాజ్పాయ్ నగర్ ఆక్రమిత ఇళ్ల తొలగింపు చేపట్టారని, దీనిని టీడీపీ రాజకీయం చేస్తుందని ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, జమ్మలమడుగు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గాలిపోతుల సుదర్శన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఆక్రమిత కట్టడాలను కూల్చివేయడం జరిగిందని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రవర్తిస్తే అది కోర్టు ధిక్కారమవుతుందని, కానీ కొందరు దళిత నాయకులు అని చెప్పుకుంటూ ఇక్కడి వాజ్పేయి నగర్ వాసులను తప్పు ద్రోవ పట్టిస్తున్నారని, వీరికి తోడు టిడిపి నాయకులు కూడా వాజ్పేయి నగర్ వాసులను రెచ్చగొడుతూ స్థానిక వైసిపి ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దళిత నాయకలు అయిన తాము ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తో మాట్లాడి వాజ్పేయి నగర్ వాసులకు తాత్కాలికంగా పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తామని, అంత వరకు సంయమనం పాటించాలని వాజ్పేయి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page