top of page

వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట 12 మంది మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 1, 2022
  • 1 min read

జమ్మూకాశ్మీర్


కొత్త సంవత్సరం రోజు మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.


ఈ సమయంలో తొక్కిసలాట జరిగి 12 మంది భక్తులు మృతి చెందినట్లుగా జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 50 మందివరకు గాయపడి ఉంటారని ప్రాథమిక సమాచారం.


గాయపడిన వారిని సమీపంలోని నరైనా ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా మంది భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. సహాయకచర్యలు వేగం పెంచాలని తెలిపారు. తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోదీ.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page