top of page

మర్మాంగం పై రోకలిబండతో దాడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 18, 2022
  • 1 min read

ఏలూరు జిల్లా : చాట్రాయి మండలం : ఉప్పెన సినిమా తరహాలో శ్రీకాంత్ (బాధిత యువకుని) మర్మాంగం పై రోకలిబండతో దాడి చేసిన యువతి తండ్రి. నరసింహారావు పాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన.

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువకుడు...పరిస్థితి విషమం, మొదట ఖమ్మం ఆసుపత్రికి తరలింపు.. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నుండి నూజివీడు ఆస్పత్రికి తరలింపు.. నూజివీడు నుండి ఇంకా మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...


ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు. తన కూతురు వెంటపడుతున్నాడు అనే నెపంతో నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన సింగపం శ్రీకాంత్(24)ని ఇంటికి పిలిపించి, చీకటి గదిలో బంధించి... చిత్రహింసలు పెట్టి.. యువకుని మర్మాంగం పై రోకలిబండతో మర్మాంగాన్ని చిద్రం చేసిన అమ్మాయి తండ్రి జాన్...

యువకునిపై దాడి చేసిన అనంతరం యువతి ఇంటి నుండి శ్రీకాంత్ ని 108లో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page