top of page

సిబిఐ విచారణ సరిగా జరగడం లేదంటూ చెప్పడం హాస్యాస్పదం - ప్రవీణ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 17, 2023
  • 1 min read

సిబిఐ విచారణ సరిగా జరగడం లేదని చెప్పడం హాస్యాస్పదం - ప్రవీణ్

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ఉపయోగించుకుని సెంటిమెంట్ రాజకీయాలకు తెరపైకి తెచ్చి వైసిపి అధికారంలోకి వచ్చిందంటూ ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ జీ.వి .ప్రవీణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆరోపించారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నందునే నిన్నటి రోజున వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిందని, దీనిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిబిఐ విచారణ సరిగా జరగడం లేదంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సొంత కుటుంబ సభ్యులకే నమ్మకం లేక సిబిఐ విచారణకు కొరితే, వైసీపీ నేతలు మాత్రం జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page