top of page

ఏ పార్టీలో చేరాలన్నది సునీత వ్యక్తిగత విషయం - ప్రవీణ్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 25, 2023
  • 1 min read

ఏ పార్టీలో చేరాలన్నది సునీత వ్యక్తిగత విషయం - ప్రవీణ్ రెడ్డి

పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ రెడ్డి

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్. వైఎస్ సునీత తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ ప్రవేశమంటూ ప్రొద్దుటూరు పట్టణంలో వెలసిన పోస్టర్లు పై టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డీ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం ఇదు గంటల ప్రాంతంలో పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ అధ్యక్షుడు లోకేష్, రాష్ట్ర, జిల్లా టిడిపి నాయకుల ఫోటోలతో డాక్టర్ వైయస్ సునీత త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని వెలసిన ఫ్లెక్సీల వలన శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఓ పార్టీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నట్లు ఆయన ప్రధానంగా ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా వైయస్ వివేక హత్య కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారగా, నేడు సిబిఐ అధికారుల విచారణ పూర్తికావస్తున్న నేపథ్యంలో పోస్టర్లు అంటించడం వలన వివేక హత్య కేసు విచారణ వివరాలు దారి మళ్లించడానికి వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ పోస్టర్లు అంటించారని ఆయన అన్నారు. ఏ పార్టీలో చేరాలన్నది సునీత వ్యక్తిగత విషయమని ఆయన పేర్కొన్నారు. పోస్టర్ల వ్యవహారం పై పోలీసు శాఖ వారు తక్షణం విచారణ జరిపి ఈ పోస్టర్లు అంటించిన వారిని గుర్తించి తగు చర్యలకు ఉపక్రమించాలని ఆయన కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page