top of page

మజ్జిగ (2/-) చలివేంద్రం ఏర్పాటు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 4, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం శివాలయం సర్కిల్ నందు నేడు కొనిరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రెండు రూపాయలకే మజ్జిక చలివేంద్రం ఏర్పాటు చేశారు.

కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కొత్తపల్లె సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివ చంద్రా రెడ్డి కుమార్తె కొనిరెడ్డి హిమజా ప్రరంభించిన ఈ చలివేంద్రంలో రెండు రూపాయలకే ప్రజలకు మజ్జిగ అందుబాటులోకి తీసుకు వచ్చారు ఫౌండేషన్ సభ్యులు. ఈ సందర్భంగా కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు వేసవి తాపం తీరేలా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సంవత్సరం ఇప్పటికి రెండు మంచినీళ్ల చలివేంద్రాలు, ఒక మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని, అదే విధంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో పది రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, శ్రీమతి కొనిరెడ్డి శోభా రాణి, కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. కొనిరెడ్డి హిమజా, పద్మశాలీయ రాష్ట్ర చైర్మన్ శ్రీమతి జింకా విజయలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page