పెళ్లింట విషాదం ట్రాక్టర్ బోల్తా ఇద్దరు మృతి
- VOICE OF HERALD

- Feb 19, 2022
- 1 min read
ప్రకాశంజిల్లా పొదిలి కొండలక్ష్మి నరసింహస్వామి ఆలయం సమీపంలో పెళ్ళిబృందం ట్రాక్టర్ బొల్తా. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొ నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతాగాత్రులు హనుమంతునిపాడు మండలం వాలిచర్లా గ్రామానికి చెందినవారు. వరుడు పొదిలి లక్కిశెట్టిపాలెంకు చెందినవారు కాగా, వదువు హెచ్ఎంపాడు మండలం వాలిచర్ల గ్రామం. కొండ ఎక్కే సమయంలో ఎదురుగా వస్తున్న మరోట్రాక్టర్ డొర్ తగిలి ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలియజేస్తున్నారు. గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. 15 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. ట్రాక్టర్ లొ దాదాపు 30 మంది వరకు ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం.





Comments