top of page

తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

  • Writer: EDITOR
    EDITOR
  • May 5, 2023
  • 1 min read

తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

తిరుమల లో భక్తులరద్దీ ఎక్కువగానే ఉంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న గురువారం శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 28,676 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page