top of page

నేటి నుంచి అలిపిరిలో దివ్యదర్శన టోకెన్ల జారీ..

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 14, 2023
  • 1 min read

నేటి నుంచి అలిపిరిలో దివ్యదర్శన టోకెన్ల జారీ..

తిరుపతి (తితిదే) తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇప్పటివరకు గాలిగోపురం వద్ద ఇస్తున్న దివ్యదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని తితిదే మార్పు చేసింది.

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శుక్రవారం నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాలి. స్కాన్‌ చేసుకోకపోయినా, ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా.. స్వామివారి దర్శనానికి అనుమతించరు.

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) కేంద్రాన్ని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి మార్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page