ఘనంగా త్రి శక్తి అమ్మవార్ల ఆలయ శంకుస్థాపన
- VOICE OF HERALD

- Feb 21, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, త్రి శక్తి అమ్మవార్ల ఆలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది, 87 వార్డు లక్ష్మీపురం కాలనీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కి ముఖ్య అతిది గా టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్ల శ్రీనివాస్, 87 వార్డు కార్పొరేటర్ బోండా జగన్. 88 వార్డ్ కార్పొరేటర్ ముత్యాలనాయుడు పాల్గొన్నారు. పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన ఆలయ నిర్మాణం కి తన వంతు సహాయం ప్రకటించారు. అనంతరం వార్డు కార్పొరేటర్ కూడా ప్రకటించారు. ఆలయ నిర్మాణం కి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయి అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామ సభ్యులు విజయ రామరాజు, బాబురావు, రాజన్ రాజు, అవి రెడ్డి సూర్యనారాయణ, శ్రీనివాస్ వర్మ, పెంటయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.



Comments