top of page

చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కొరముట్ల స్పెషల్ డ్రైవ్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 15, 2022
  • 1 min read

చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కొరముట్ల స్పెషల్ డ్రైవ్.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం పంచాయతీ కాలనీలో మాదకద్రవ్యాలు,అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు స్థానిక పోలీసు సిబ్బందితో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అక్కడ ప్రాంతాలను తనిఖీ చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని ప్రజలు స్వయం శక్తిగా ఎదగాలని అక్కడ వారికి ముఖ్యంగా మహిళలకు పిలుపునిచ్చారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిఐ విశ్వనాథరెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు,మోహన్ కుమార్ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page