వ్యాపారంలో నాణ్యత, నమ్మకమే పెట్టుబడి - ఎస్సై వెంకటేశ్వర్లు.
- DORA SWAMY

- Aug 12, 2022
- 1 min read
యువత అన్ని రంగాల్లో రాణించాలి
నమ్మకమే పెట్టుబడి
మిల్క్ పార్లర్ ప్రారంభోత్సవంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు.

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం సదరు గ్రామంలో డి ఎం ఆర్ కాంప్లెక్స్ నందు ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగా... స్థానిక సాయిరాం స్వీట్స్ యజమాని ఏర్పాటుచేసిన తిరుమల మిల్క్ పార్లర్ ను ఈరోజు ఉదయం స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తాను మాట్లాడుతూ యువత కేవలం ఉద్యోగం కోసమే కాక వ్యాపార రంగంలో కూడా తమదైన శైలిలో రాణించాలని; వ్యాపారం అన్నది నమ్మకం, నాణ్యత మీద ఆధారపడి ఉంటుందని; వ్యాపారానికి అవే పెద్ద పెట్టుబడి అని పేర్కొంటూ మెలకువలు సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల మిల్క్ డైరీ తిరుపతి బ్రాంచ్ మేనేజర్ రెడ్డిప్రసాద్,సేల్స్ ఎగ్జిక్యూటివ్ దాము,మోహన్,పార్లర్ యజమాని సాయిరాం, పాత్రికేయులు శివ, సాయి, వాసు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు పోలీస్ సిబ్బంది కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.



Comments