ఎంపీడీవో, ఎ ఓ ల సేవలు అందరికీ ఆదర్శం అన్న మండల పాత్రికేయులు.
- DORA SWAMY

- Jul 2, 2022
- 1 min read
ఎంపీడీవో, ఏవో ల బదిలీ..
వారి సేవలు అందరికీ ఆదర్శం మండల పాత్రికేయులు.

అన్నమయ్య జిల్లా,చిట్వేలి మండలంలో ఎంపిడిఓ సమత,ఏ.ఒ. నాగభూషణం లు, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ బాధ్యతాయుతమైన విధులునిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలందించారని మండల సీనియర్ పాత్రికేయులు మల్లికార్జున, భాస్కర్ నాయుడులు పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం బదిలీపై వెళుతున్న ఎంపిడిఓ సమత, ఏవో నాగభూషణ లను స్థానిక పాత్రికేయుల సంఘం సభ్యులు ఎంపిపి కార్యాలయంలో ఆత్మీయసమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా ఇరువురుఅధికారులకు శాలువాలుకప్పి పూలమాలలతోఘనంగా సన్మానించారు.
ఈసమావేశం లోపాత్రికేయులు మాట్లాడుతూ ఎక్కడఉన్నా ప్రజమన్నానలు పొందుతూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఎంపీడీవో సమత విజయవాడకు, ఏవో నాగభూషణo సిద్ధపటం కు బదిలీ అయ్యారు.
ఈ కార్యక్రమంలో ఇఓపిఆర్డి పులిరాంసింగ్, స్థానిక పాత్రికేయులు వేణుగోపాల్ , అవినాష్ ,సాయికృష్ణ, సాయిరాం, వాసు, వెంకట్ రెడ్డి, వరుణ్ తేజ్, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.



Comments