top of page

చిట్వేలి లో.. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 2, 2022
  • 1 min read

మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన.

--నడుం బిగించిన జనసైనికులు, సిహెచ్ఎస్ సభ్యులు.

--మేము సైతం అన్న మహిళలు.

---ఒకే కుటుంబం నుంచి రక్తదాతలుగా నిలిచిన 6 మంది.

జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలో మండల పరిధిలోని జనసేన నాయకులు అభిమానులు మరియు చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

ఉదయాన్నే సిహెచ్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యుడు జనార్ధన్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమం తదుపరి మహిళలు మేమేమి తక్కువ కాదంటూ రక్తదాతలుగా నిలిచారు. వీరిలో కవిత, గట్టుమీద పల్లె గ్రామానికి చెందిన మహిళలతో కూడిన ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు రక్తదానం ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. 70 యూనిట్ల రక్తాన్ని దాతల సహకారంతో సేకరించామని గణేష్ నిమజ్జనం లాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ అభిమానులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని వారందరికీ మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామని పేర్కొన్నారు. తదుపరి రక్తదానాన్ని నొసగిన దాతలందరికీ స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు చేతల మీదుగా ధ్రువపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిహెచ్ఎస్ సేవా సంస్థ సభ్యులు మండల పరిధిలోని అన్ని గ్రామాల పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, స్వచ్ఛంద దాతలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page