top of page

నామమాత్రంగా ముగిసిన వ్యవసాయ సలహా మండలి సమావేశం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 21, 2022
  • 1 min read

నామమాత్రంగా వ్యవసాయ సలహా మండలి సమావేశం.



--అల్ప సంఖ్య లో పాల్గొన్న అధికారులు,సభ్యులు.

-- రైతుల నీటి అవసరాలపై జరగని చర్చ.


నీటిపారుదల ప్రణాళికను చర్చించడానికి శనివారం చిట్వేలి మండల వ్యవసాయ అధికారి రాజకుమారి అధ్యక్షతన మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మండల వ్యాప్తంగా వివిధ చెరువులు నందు నిలువు ఉన్న నీటి సామర్థ్యం గురించి మరియు రైతులు సాగు చేసిన పంటలకు కావాల్సిన నీటి వసతిని గూర్చి పాల్గొన్న అధికారులు హాజరైన సభ్యుల సమక్షంలో చర్చజరగాల్సి ఉంది.


ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా.. వ్యవసాయ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఇరిగేషన్ శాఖ నుంచి ఇరిగేషన్ అసిస్టెంట్ మరియు ముగ్గురు సలహా మండలి సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page