top of page

తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 6, 2022
  • 1 min read

తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన


రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి, ఆస్పత్రి నుంచి బైక్ పై స్వగ్రామానికి తీసుకెళ్లిన తండ్రి. మృతదేహం తరలించలేమన్న 108 వాహన సిబ్బంది, 108 వాహన సిబ్బంది నిరాకరించడంతో తండ్రి అవస్థలు. నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటోల నిరాకరణ, ప్రైవేటు అంబులెన్స్ కు డబ్బుల్లేక బైక్ పైనే మృతదేహం తీసుకెళ్లిన తండ్రి.

బాధితుల స్వగ్రామం దొరవారిసత్రం మండలం కొత్తపల్లి. నిన్న కొత్తపల్లిలోని గ్రావెల్ గుంతలో పడి అక్షయ(2) మృతి. ప్రమాదవశాత్తు గ్రావెల్ గుంటలో పడి నీటమునిగిన అన్న, చెల్లెలు, గ్రావెల్ గుంతలో పడిన శ్రవంత్ ను కాపాడిన గొర్రెల కాపరి. అక్షయ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలింపు. నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోగా చిన్నారి మృతి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page