top of page

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం - తోట మహేశ్వర్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 5, 2024
  • 1 min read

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం - తోట మహేశ్వర్ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన నంద్యాల వరదరాజుల రెడ్డికి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ప్రత్యేకించి రాజుపాలెం మండల ప్రజలు టిడిపికి మెజారిటీ సాధించి పెట్టటం తమకు ఎంతగానో సంతోషంగా ఉందని, మండలంలోని నాయకులు గ్రామాలలోని నాయకులు కార్యకర్తలు సైనికుల వలె వారి శక్తికి మించి కృషి చేసి టిడిపికి మెజారిటీ సాధించి పెట్టారని, ఈ సందర్భంగా రాజుపాలెం మండల ప్రజలకు మాజీ జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి నెహ్రు రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. తమ ప్రభుత్వ హయాంలో మండలంలోని నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వాగ్దానం చేశారు.

అనంతరం టిడిపి నాయకులు కొర్రపాడు రామచంద్రారెడ్డి, అరకటవేముల కృష్ణారెడ్డి, బూతూరు వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికలలో రాజుపాలెం మండలంలో వైసిపి ఆదిత్యం సాధించిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడి మండల ప్రజలు టిడిపికి ఆదిత్యం ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఇదే విధంగా సమిష్టిగా కృషిచేసి టిడిపి నాయకులను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు టిడిపిని ఆదరించిన విధంగానే మండలంలోని గ్రామాలను అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page