top of page

మాతా కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న - తిప్పల దేవన్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 31, 2022
  • 1 min read

వడ్లపూడి ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, మాతా కనక దుర్గమ్మ అమ్మవారి రెండో వార్షికోత్సవ సందర్భంగా తల్లిని దర్శించుకున్న వైయస్సార్సీపి గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి. 85వ వార్డు పెద్దమడక గ్రామంలో శ్రీ మాతా కనక దుర్గమ్మ అమ్మవారి రెండో వార్షికోత్సవ సంబరాలు కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, ఘనంగా స్వాగతం పలికిన 85వ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మీ ప్రసాద్. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తిప్పల దేవన్ రెడ్డి, అలాగే అమ్మవారికి అందరూ బాగుండాలని ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలందరూ అనారోగ్యంగా ఉన్న ప్రజలు కోలుకోవాలని ధైర్యం పెంచాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సమయాన్ని తల్లి యొక్క దీవెనలతో ప్రజలందరూ ఎల్లవేళలా చల్లగా ఉండాలని మనసారా పూజలు నిర్వహించడం జరిగిందని ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బల్లా పైడి రాజు, కారణం లక్మి, నక్కా రమణ బాబు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page