top of page

మెహర్ బాబా నగర్ లో చోరీ నగదు, బంగారం అపహరణ

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 29, 2023
  • 1 min read

మెహర్ బాబా నగర్ లో చోరీ నగదు, బంగారం అపహరణ

దొంగతనం జరిగిన గదిలో చిందరవందరగా పడి ఉన్న వస్తువులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


పట్టణంలోని నలంద పాఠశాల వద్ద గల మెహర్ బాబా నగర్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిలో చోరీ చేసి నగదు, బంగారాన్ని అపహరించిన ఘటన శనివారం చోటుచేసుకుంది.


బాధితులు తెలిపిన వివరాల మేరకు..... మెహర్ బాబా నగర్ కు చెందిన అశోక్ పి.ఆర్.ఆర్.డి లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ప్రియాంక అప్పారాజుపేట లో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు సెలవులు కావడంతో లక్కిరెడ్డి పల్లెలోని తమ అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. దంపతులిద్దరూ ఉద్యోగులు కావడంతో ఉదయాన్నే ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారని ఇంటి యజమాని అశోక్ తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కటాంజనంకు ఉన్న తాళాలు పగలగొట్టి, ఇంటిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో అనుమానించి చూసేసరికి బీరువాలో ఉన్న నగదు, బంగారం అపహరణకు గురి అయినట్లు తెలిసిందని బాధితులు తెలిపారు. ఐతే రూ 1.50 లక్షలు నగదు, బంగారం ఉండగా కేవలం రూ 50 వేలు నగదుతో పాటు కొంత బంగారం వదిలేసి 11.5 తులాల బంగారం మాత్రం పట్టుకెళ్లారని తెలియజేశారు. దొంగలు హడావిడిలో కొంత నగదు, బంగారాన్ని వదిలి వెళ్లారా.! అని అనుమానించాల్సి వస్తోందని తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page