top of page

మాకు ప్రాణహాని ఉంది - తనికంటి జ్యువెలర్స్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 1 day ago
  • 1 min read

మాకు ప్రాణహాని ఉంది - తనకంటి జ్యువెలర్స్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరులో తనికంటి జువెల్లర్స్ యజమాని శ్రీనివాసులు నిర్వహించిన మీడియా సమావేశం సంచలనంగా మారింది. తనపై పలువురు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన ఆయన, ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 18 మంది ఈ వ్యవహారంలో పాల్గొన్నారని, కిరాయి హంతకుల ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.మారణాయుధాలతో బెదిరింపులు, దాడి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న శ్రీనివాసులు.. తనకు లేదా తన కుటుంబానికి ఏదైనా జరిగితే ఫిర్యాదులో పేర్కొన్న వారే బాధ్యత వహించాలని అన్నారు. కుటుంబ ఆస్తుల పంపకం పూర్తయ్యిందని, వివాదానికి సంబంధించిన కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పారు. రైతుల వద్ద నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేసిన ఆయన, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని చెబుతూ పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page