top of page

ఆలయ విగ్రహ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 4, 2022
  • 1 min read

ఆలయ విగ్రహ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొరముట్ల.

ఈరోజు ఉదయం చిట్వేల్ మండలం రాపూరు రోడ్డు తిమ్మాయపాలెం క్రాస్ నందు గల శ్రీదత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమంలో ఏర్పాటుచేసిన శ్రీఆంజనేయ స్వామి విగ్రహ పనులను ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను ఆలయ ధర్మకర్త నారాయణమ్మను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, రైల్వే కోడూరు మండల కన్వీనర్ సుధాకర్ రాజు స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు, వైసీపీ యువ నాయకులు గిరిబాబు రాజు, మోచర్ల నరసింహ, స్థానిక పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page