top of page

తెలుగు యువత ప్రతినిధులు అరెస్ట్ ఆపై విడుదల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 5, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు, పదవ తరగతి ప్రశ్నల పత్రాల లీకేజీ విషయంలో తలపెట్టిన కలెక్టరేట్ వద్ద ధర్నాలో సంఘీభావం తెలుపుటకు వెళ్తున్న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, టి.ఎన్.ఎస్.ఎఫ్ కార్య నిర్వాహక కార్యదర్శి రాజేష్ నాయుడు, తెలుగు యువత నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు.

ఈ సందర్భంగా నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టవలసిన టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ఇలా ప్రశ్నపత్రాలు లీక్ చేయటం తగదని, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ లో ప్రమేయం ఉన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థులకు తగు న్యాయం చేయాలని తెలుగు యువత డిమాండ్ చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page