top of page

బహిరంగ చర్చకు నేను సిద్ధం - తెల్లాకుల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 16, 2022
  • 1 min read

Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365

*-*-*-*-*

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఈరోజు మధ్యాహ్నం ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ బహిష్కృత తెల్లాకుల మనోహర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఆర్యవైశ్య సభ పెద్దలు అనుసరిస్తున్న పలు అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సభలోని పలు వర్గాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది. ముఖ్యంగా స్టెయిన్ లెస్ స్టీల్ వ్యాపార విభాగానికి ఎన్నిక జరగగా అందులో వ్యాపారికి ఓటు హక్కుతో పాటు వారి కుటుంభ సభ్యులకు కూడా ఓటు హక్కు కల్పించారని. పలువురు నాయకులు ఆర్యవైశ్య సభను తప్పుద్రోవ పట్టిస్తున్నారని, ఎన్నిక జరుగుతున్న విధానాన్ని తప్పు పడుతూ, ఈ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి ఆర్యవైశ్యులు అందరికీ ఓటు హక్కు కల్పించాలని, ఆర్యవైశ్య సభలో దాదాపు ఎనిమిది వందల మంది మహిళలు ఉండగా వారిని ఓటర్లుగా మాత్రమే గుర్తిస్తున్నారని, వారిని కూడా పురుషులతో పాటు సమాన హక్కు కల్పిస్తూ అభ్యర్థులుగా ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్యవైశ్య సభ నేతలతో బహిరంగ చర్చకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page