top of page

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యత ఉపాధ్యాయులదే

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 5, 2022
  • 1 min read

శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధి నందు ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠాశాల నందు ప్రతిరోజూ జరిగే ప్రార్థనలో భాగంగా నేటి ప్రార్థనకు బిజిపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి చంద్రప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి వారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతకు మించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని తెలియజేశారు. అటువంటి మహోన్నతమైన బాధ్యతను ఉపాధ్యాయులందరు కూడా చాలా చక్కగా నిర్వర్థించి విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తుకు, తద్వారా దేశ అభివృద్ధికి బాటలు వేయాలని కోరడం జరిగింది.


ప్రార్థనలో పాఠశాల అధ్యక్షులు లేబాక మంగిరెడ్డి, పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు కాళహస్తి ఉమాశంకర్, మొద్దు సుబ్రమణ్యం, శైక్షణిక్ ప్రముఖ్ వెంకట సంజీవయ్య గారు, పాఠశాల జిల్లా కార్యదర్శి కీర్తి వెంకటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page