top of page

జంగారెడ్డిగూడెం నాటుసారా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి - టీడీపీ డిమాండ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 20, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు నియోజకవర్గం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జీ.వి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కల్తీ సారా, ఇతర బ్రాండ్స్ నిషేధం పై టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని SEB కార్యాలయం వద్ద, ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీ భగత్ సింగ్ కాలనీ లోని ప్రభుత్వ వైన్ షాప్ వద్ద అలాగే రాజుపాలెం ప్రభుత్వ వైన్ షాపు వద్ద కల్తీ మద్యం, బెల్టుషాపులు, నాటుసారా, ఇతర బ్రాండ్స్ ను వెంటనే నిర్మూలించాలని నిరసన నిర్వహించడం జరిగింది. మృతుల కుటుంబాలకు తగు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసిన టీడీపీ నేతలు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వారి వారి నియోజకవర్గాలలో అలాగే మండలాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి V.S.ముక్తియార్, పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కోటా శ్రీదేవి, భోగాల లక్ష్మీనారాయణమ్మ, రామేశ్వరం లక్ష్మీదేవి, కుతుబుద్దున్, ఆవుల దస్తగిరి, రాజేష్ నాయుడు, టి భరత్ రెడ్డి మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, కసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వెంగలయపల్లె శ్రీనివాసులు రెడ్డి, వెలువలి పద్మనాభరెడ్డి, కొట్టాల జగన్ రాజుపాలెం యాడికి కిరణ్, సాన శివనాగిరెడ్డి నిరసనలో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page