top of page

టీడీపీలో పోస్టర్ల కలకలం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 29, 2024
  • 1 min read

టీడీపీలో పోస్టర్ల కలకలం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరులో టిడిపి టికెట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఉన్న వాల్ పోస్టర్లను ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పట్టణమంతా అంటించారు. దీంతో తెల్లవారేసరికి పోస్టర్ల వ్యవహారం పట్టణం అంతా వ్యాపించి హాట్ టాపిక్ గా మారింది. ప్రొద్దుటూరు టిడిపి టికెట్ రేసులో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి.. లింగారెడ్డి, రాజ్యసభ ఎంపీ రమేష్ నాయుడు సోదరుడు సురేష్ నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రొద్దుటూరు టిడిపి టికెట్ తనకేనంటూ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి వాల్ పోస్టర్లు ప్రత్యక్షం అవ్వటంతో వివాదం మరింత ముదురుతున్నట్లు తెలుస్తుంది.


ఈ విషయమై ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పాత్రికేయులు ప్రశ్నించగా? ఇందుకు ఆయన సమాధానం ఇస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు గత నాలుగున్నర సంవత్సరాల నుండి తాను పార్టీకి చేసిన సేవలను, పార్టీ కష్ట కాలంలో తన సేవలను గుర్తించి కార్యకర్తలు పోస్టర్లు వేసారేమో అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ, చివరగా ప్రొద్దుటూరు టిడిపి టికెట్ తనకేనని కేటాయించాలని కుండబద్దలు కొట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page