top of page

నల్లబోతుల ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబెడ్కర్ 131వ జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 14, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు లో నేడు టీడీపీ ఆధ్వర్యంలో భారత రత్న డా. బి.ఆర్ అంబెడ్కర్ 131వ జయంతి సందర్భంగా, పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి సుమాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ, అంటరానితనం పై పోరాడిన ధిరోధాత్తుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని కొనియాడారు, బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, యమ్మనురు ఆంజనేయులు, లాయర్ గుర్రాప్ప, కనపల్లి బద్రి, షరీఫ్, రాజు, మధు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page