top of page

టిడిపి మోత మోగిద్దాం నిరసన కార్యక్రమం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 30, 2023
  • 1 min read

టిడిపి మోత మోగిద్దాం నిరసన కార్యక్రమం

మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బ్రాహ్మణి పిలుపు మేరకు, శనివారం రాత్రి పొద్దుటూరు పట్టణంలోని పదవ వార్డు నందు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో మోత మోగిద్దాం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ.వీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని కనీసం ఈ మోత తాడేపల్లి ప్యాలెస్ లోకి వినపడాలని ఈరోజు మోత ముగిద్దాం కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ, అవినీతిపరులకు అధికారం ఇస్తే నిజాయితీపరులు జైలు పాలవుతారు అనేదానికి నిదర్శనమే ఈ ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు అని అన్నారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు అని, కానీ జగన్ అధికారము అడ్డం పెట్టుకొని అవినీతి కేసుల్లో ఇరికించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లబోతుల పావని, తెలుగు యువత నాయకులు ఎమ్మనూరు ఆంజనేయులు, పల్ల సాయిరాం, వార్డు ప్రజలు పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page