top of page

శనివారం నుండి టీడీపీ సభ్యత్వ నమోదు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 25, 2024
  • 1 min read

శనివారం నుండి టీడీపీ సభ్యత్వ నమోదు

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


శనివారం నుండి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుకానున్నదని, ఉదయం 11 గంటలకు టిడిపి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, కావున పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, క్రియాశీలక కార్యకర్తలతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు, భారీగా సభ్యత్వాల నమోదు లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు. కావున 2024-2026 సంవత్సరానికి గాను టిడిపి సభ్యత్వాలు పొందదదలిచినవారు ఆన్లైన్ ద్వారా కానీ, సభ్యత నమోదు కార్యక్రమానికి వచ్చి తమ సభ్యత్వాలను పొందవచ్చని కోరారు. ఈ సందర్భంగా నెహ్రూ రోడ్డులోని టిడిపి పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, సీనియర్ టిడిపి నాయకులు ఈ.వి సుధాకర్ రెడ్డి, టిడిపి నాయకులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page