top of page

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 26, 2024
  • 1 min read

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక నెహ్రూ రోడ్డు లోని టిడిపి కార్యాలయం నందు లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. అనంతరం తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్న ఎమ్మెల్యే వరద. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడిపి సభ్యత్వ నమోదు ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నూరు రూపాయల పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా, చదువులకు ఆర్థిక సాయం, క్లిష్ట సమయాలలో పార్టీ అండ సభ్యులకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు వి ఎస్ ముక్తియార్, పట్టణ అధ్యక్షుడు డివి సుధాకర్ రెడ్డి, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page