top of page

లింగారెడ్డి విమర్శనాస్త్రాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 17, 2022
  • 1 min read

కేక్ కట్ చేసి ...ర్యాలీ చేస్తే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయా? - టిడిపి జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి విమర్శనాస్త్రాలు.

కేక్ కట్ చేసి పటాకులు పేల్చి ర్యాలీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి ప్రశ్నించారు.తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు అభ్యర్థినంటు శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణంలో బాణాసంచా పేలుస్తూ, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు,కడప పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జిలే అభ్యర్థులుగా ఉంటారని ఆయన మీడియా ముందు వివరించారు.కాగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి మాత్రం దీన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టి చేప్పారు. తెలుగుదేశం పార్టీలో టికెట్లు రావాలంటే ఎంతో త్యాగాలు చేసి ఉండాలని, కష్టాలు నష్టాలు భరించి ఆస్తులను పోగొట్టుకున్న వారు ఉన్నారన్నారు. అభ్యర్థులుగా నిలబడే వ్యక్తులు వారి గత చరిత్ర వారి వ్యక్తిగతం స్వచ్ఛమైనదిగా ఉండాలని చెప్పుకొచ్చారు. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఎవరిని అధికారికంగా అభ్యర్థులుగా ప్రకటించలేదని కొంతమంది తమకు టికెట్ వచ్చిందని ప్రచారం చేసుకోవడం మంచి సంప్రదాయం కాదన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page