top of page

బూటుతో కొట్టుకున్న టీడీపీ నాయకుడు - ప్రొద్దుటూరు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 27, 2022
  • 1 min read

బూటుతో కొట్టుకున్న టీడీపీ నాయకుడు - ప్రొద్దుటూరు


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

ప్రసన్న ఆంధ్ర, ప్రొద్దుటూరు 27-06-2022, నేడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.ఎస్. ముక్తియార్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ టీడీపీ నాయకులు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మునిసిపల్ మాజీ కౌన్సిలర్ కుమారుడు ఖలీల్ మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలపై మండి పడ్డారు. దర్గా ప్రహారీ గోడను జె.సి.బి తో కూల్చటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిసే ఇలాంటి సంఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తన బూటుతో తానే పలుమార్లు కొట్టుకున్నారు. ఇకనైనా ముస్లిం సోదరులు అందరూ ఒక తాటిపై నిలబడి ముస్లిం మైనారిటీ ఆస్తులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page