top of page

రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అన్న క్యాంటీన్ - స్పష్టం చేసిన సీఎం సురేష్ నాయుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 24, 2023
  • 1 min read

రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అన్న క్యాంటీన్ - స్పష్టం చేసిన సీఎం సురేష్ నాయుడు

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం సురేష్ నాయుడు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే తాను ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ స్థాపించినట్లు టిడిపి నాయకులు సీఎం సురేష్ నాయుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఇందులో దాపరికం ఏమీ లేదని స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తన ముందు ఉన్న లక్ష్యంగా రాబోవు ఎన్నికలలో ప్రొద్దుటూరులో టిడిపి నాయకులను కలుపుకొని పార్టీ జెండా ఎగురవేయటమే లక్ష్యమని, అందుకు తాను ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రొద్దుటూరులో తాను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు సురేష్ నాయుడు.


ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తమపై పరుష పదజాలంతో టిడిపి నాయకులను మాట్లాడటం సబబు కాదని హితువు పలికారు. తాను కూడా రాచమల్లు వారి రాజన్న భోజనం ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని, రాచమల్లు అన్న క్యాంటీన్ కు విచ్చేసి భోం చేస్తానని చెప్పటం తనకి ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఎమ్మెల్యే రాచమల్లు ను తాను సాదరంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page