top of page

టీడీపీ ఇంచార్జ్ నరసింహ ప్రసాద్ దీక్ష భగ్నం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 4, 2022
  • 1 min read

రాజంపేట జిల్లా కోసం దీక్షకు పూనుకున్న పంతగాని ప్రసాద్ భగ్నం చేసిన పోలీసులు.


ఈ రోజు ఉదయం రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని చిట్వేలు మండలం నాగవరం లోని తన ఇంటిముందు ఆమరణ దీక్షకు పూనుకున్న తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక అధ్యక్షులు పంతగాని ప్రసాద్, తాను మాట్లాడుతూ కేవలం ఏ కొందరి రాజకీయ లబ్ధి కోసం తప్ప; ఎలాంటి వసతులు లేని రాయచోటి ఏ ఒక్కరికి ఆమోదయోగ్యం కాదని ఇలాగే చూస్తూ ఉంటే భావితరాలకు మనందరం అన్యాయం చేసిన వారం అవుతాం అని అన్నారు. ఇప్పటికైనా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్న కొరముట్ల శ్రీనివాసులు రాజంపేట జిల్లా కోసం ఒక గంట అయినా దీక్షకు పూనుకోవాలని అప్పుడు మాత్రమే ప్రజలు క్షమిస్తారని అన్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో దీక్షను కొనసాగనివ్వకుండా సిఐ విశ్వనాథరెడ్డి ఎస్సై వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి పరిధిలోని చిట్వేల్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. కాగా వైద్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా బిపి సుమారు 210 పాయింట్లు ఉండడంతో తిరిగి విడుదల చేయడం జరిగింది. ఎన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెనక్కు తగ్గేది లేదని కొంత గాని పలకడం విశేషం.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page