top of page

టిడిపి ఇన్చార్జి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jan 1, 2023
1 min read

టిడిపి ఇన్చార్జి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఆయన అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రవీణ్ రెడ్డి అభిమానులు కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ నుండే కాక జిల్లాలోని పలు ప్రాంతాల నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆయనకు పూలమాల వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కెకును కట్ చేసి విచ్చేసిన వారికి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు, ప్రవీణ్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page