top of page

మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ ఫ్లెక్సీ ప్రదర్శించిన 80సం వృద్దుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 10, 2022
  • 1 min read

ఎవరెస్ట్ శిఖరంపై టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించిన 80 ఏళ్ల వృద్ధుడు... అభినందించిన చంద్రబాబు


మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ ఫ్లెక్సీ


5 వేల మీటర్ల వరకు ఎక్కిన గింజుపల్లి శివప్రసాద్


వీడియో పంచుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు


సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదన్న చంద్రబాబు

అమరావతి, హిమాలయాల్లో సమున్నత శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ ఫ్లెక్సీ ఆవిష్కృతమైంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని తెలిపారు. ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల ఎత్తు వరకు అధిరోహించారని, అక్కడ టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారని వివరించారు.


ఈ సందర్భంగా శివప్రసాద్ కి అభినందనలు తెలుపుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తాను గతంలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు... ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని గుర్తు చేసుకున్నారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని శివప్రసాద్ ను కొనియాడారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page