top of page

జోరందుకున్న టిడిపి ఎన్నికల ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 1, 2024
  • 1 min read

జోరందుకున్న టిడిపి ఎన్నికల ప్రచారం

29వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న వరద
ఒకటో వార్డు నందు ప్రచారం నిర్వహిస్తున్న వరద కుటుంబ సభ్యులు
సోములవారిపల్లి పంచాయతీలో ప్రచారం నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు జోష్ అందుకొని పలు వార్డులలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ 29వ వార్డు నందు జింక రామకృష్ణ ఆధ్వర్యంలో టిడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, ఆయన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి వార్డు పరిధిలోని రామాలయం వీధి, బంగారయ్య కొట్టాల వీధులలో ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఒకటో వార్డు బుడ్డాయిపల్లె, బొల్లవరం నందు ఇంటింటి ప్రచారంలో భాగంగా వరద కుటుంబ సభ్యులు మెట్టుపల్లి అనురాధ, నంద్యాల మీనా కోమల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయితీ పరిధిలోని పెన్నా నగర్ 15, 16, 17వ వార్డుల నందు నంద్యాల గోవర్ధన్ రెడ్డి, నంద్యాల ప్రసాద్ రెడ్డి, హనుమంత రెడ్డి లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి, అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి ఓట్లు వేయమని అభ్యర్థించారు.

ప్రచార కార్యక్రమంలో టిడిపి నాయకులు వీఎస్ ముక్తియర్, ఈవీ సుధాకర్ రెడ్డి, భోగాల లక్ష్మీనారాయణమ్మ, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కుమార్, పి మధు, ఎస్ రమణయ్య, శంకర్, సురేష్, సుబ్బయ్య, చందు, షేక్షా, రాజశేఖర్, పలువురు క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page