top of page

వద్ది బాలుడు ఆధ్వర్యంలో టిడిపి ఎన్నికల ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 19, 2024
  • 1 min read

వద్ది బాలుడు ఆధ్వర్యంలో టిడిపి ఎన్నికల ప్రచారం


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి ఎన్నికల ప్రచారాలు జోరు అందుకున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 37వ మున్సిపల్ వార్డు మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు ఆయన కుమారుడు వద్ది ఓబులేసు ఆధ్వర్యంలో వార్డు నందు ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఉమ్మడి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వార్డులోని గడపగడపకు వెళ్లి టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను వారికి వివరించి, కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓట్లు అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో టిడిపి ముఖ్య నేతలైన చదిపిరాళ్ల రాంగోపాల్ రెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి, వి.ఎస్ ముక్తియార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురాం రెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఘంటశాల వెంకటేశ్వర్లు, వంగనూరు మురళీధర్ రెడ్డి, చిలకల కృష్ణారెడ్డి, బద్వేలు శ్రీనివాసుల రెడ్డి(వాసు), బొగ్గుల సుబ్బారెడ్డి, జింక రమణమూర్తి, సిద్దయ్య, నాగేశ్వర్ రెడ్డి, నంగనూరు పల్లె నాగేష్ యాదవ్, చౌటపల్లి లక్ష్మీరెడ్డి, చెల్లా రాజగోపాల్ యాదవ్, లాయర్ శీను, బిజెపి నాయకులు నాగేంద్ర, భోగ శివ కళ్యాణి, జనసేన నాయకులు జిలాన్, క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page