top of page

పర్లపాడులో జోరుగా టిడిపి ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 15, 2024
  • 1 min read

పర్లపాడులో జోరుగా టిడిపి ప్రచారం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాజుపాలెం మండలం పర్లపాడు, రామచంద్రాపురం గ్రామాలలో మాజీ జడ్పిటిసి తోట మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి ప్రచారం ఏర్పాటు చేయగా, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన కుమారుడు టిడిపి యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్లపాడు గ్రామంలోని కూడలి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వరద మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా రానున్న టిడిపి ప్రభుత్వంలో కృషిచేసి రైతులకు మైలవరం కేసీ కాలువల ద్వారా సాగునీరు అందించి మండలంలోని అన్ని గ్రామాల రైతులను ఆదుకుంటామని అన్నారు. కావున మే 13వ తేదీ జరుగు ఎన్నికలలో టిడిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, కడప ఎంపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్ ముసలిగాళ్ళ అమల, మాజీ సర్పంచ్ ఈశ్వరమ్మ, మండల తెదేపా మాజీ అధ్యక్షుడు ధనిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ చెమికల పురుషోత్తం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వియస్ ముక్తియార్, పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డి, చల్లా రాజగోపాల్ యాదవ్, చదిపిరాళ్ల వేణుగోపాల్ రెడ్డి, చదిపిరాళ్ల రామమోహన్ రెడ్డి, చెమికెల కృష్ణారెడ్డి, నాయకులు కసిరెడ్డి రామమోహన్ రెడ్డి, లక్ష్మీసుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, జీరెడ్డి కిట్టి చెన్నారెడ్డి, బీరం సత్యనారాయణరెడ్డి, కొండారెడ్డి, నాగేళ్ల బాలఆంజనేయులు, చెమికల నాగలక్ష్మీరెడ్డి, పలువురు నియోజకవర్గ టిడిపి నాయకులు, పర్లపాడు గ్రామ ప్రజలు, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page