top of page

27వ వార్డులో టిడిపి అభ్యర్థి వరద ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 8, 2024
  • 1 min read

27వ వార్డులో టిడిపి అభ్యర్థి వరద ప్రచారం

గజబాలతో వరదను సన్మానిస్తున్న తలారి సోదరులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు నందు ఉమ్మడి పార్టీలు బలపరిచిన టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 27వ వార్డు టీడీపీ ఇంచార్జ్ మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వరదకు ఇక్కడి స్థానిక నాయకులు గజమాల వేసి సన్మానం చేయగా, కార్యకర్తలు, వార్డు ప్రజలు పూలమాలలు వేసి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా టిడిపి అభ్యర్థి వరద ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వర్డులోని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి వి.ఎస్ ముక్తియార్, మాజీ పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, కౌన్సిలర్ లు వంగనూరు మురళీధర్ రెడ్డి, మునీర్, మహిళా అధ్యక్షురాలు బి. లక్ష్మీనారాయణమ్మ, చౌటపల్లి లక్ష్మిరెడ్డి, చీమల రాజశేఖర్ రెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ బిజెపి అధ్యక్షులు నాగేంద్ర, రాఘవేంద్ర రెడ్డి, బిజెపి మహిళా నాయకురాళ్లు శివ కళ్యాణి, నాగరత్నమ్మ, పలువురు బిజెపి నాయకులు, జనసేన నాయకులు జిలాన్ భాష, సుంకర మురళి, వరద అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page