top of page

రాయచోటి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 28, 2022
  • 1 min read

(ప్రసన్న ఆంధ్ర, ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ, రాయచోటి), రాయచోటి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ


స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కొరకు (స్కిల్ డెవలప్మెంట్) రెండు కుట్టు మిషన్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బహూకరించడమైనది. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి హర్ష లత గారు మాట్లాడుతూ, విద్యార్థులలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి రోటరీ క్లబ్, రాయచోటి శాఖవారు కుట్టు మిషన్లు అందజేయడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రెడ్డన్న మాట్లాడుతూ మేము అందిస్తున్న కుట్టు మిషన్ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, రోటరీ క్లబ్ మాజీ సహాయ గవర్నర్ పబ్బిశెట్టి సురేష్ కుమార్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల అభివృద్ధి కొరకు మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ఆఫీసర్స్ కూనా కృష్ణదేవరాయలు, సయ్యద్ రియాజుద్దీన్, సయ్యద్అష్రఫ్ అలీ, కార్యదర్శి నరసింహారెడ్డి, అధ్యాపకులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page