top of page

స్వచ్చతా హి సేవా పై అవగాహన ర్యాలీ

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 1, 2023
  • 1 min read

స్వచ్చతా హి సేవా పై అవగాహన ర్యాలీ

బస్టాండ్ కూడలిలో మానవహారం చేపట్టిన పంచాయతీ సిబ్బంది

నందలూరు మండలం లో జిల్లా పంచాయతీ అధికారి, అన్నమయ్య వారి ఆదేశాల మేరకు స్వచ్చతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ తారీక్ ఏక్ దిన్ ఏక్ గంట కార్యక్రమం నందలూరు గ్రామ పంచాయతీ, నాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ అధికారులు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో గుర్తించబడిన ప్రాంతాల్లో శ్రమదానం తో శుభ్రం చేయడమైనది. స్వచ్చతపై ర్యాలీ నిర్వహించి బస్టాండ్ నందు మానవహారం చేపట్టమైనది. స్వచ్చతపై నినాదాలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ సూర్య నారాయణ, నందలూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి యం.సుభాషిణి, మాజీ ఎంపీటీసీ యం.రాము, యం.పి.టి.సి.సుభాన్ ఈ.ఒ.ఆర్.డి. కార్యదర్శి శ్రీనివాసులు, పారిశుద్ధ్య సిబ్బంది, క్లాప్ మిత్రలు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు , ఇతరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page