స్వరాజ్య నగర్లో గడప గడప
- VOICE OF HERALD

- Sep 30, 2022
- 1 min read
స్వరాజ్య నగర్లో గడప గడప
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు సెప్టెంబర్ 30
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం 7:30 నుండి స్థానిక 7వ వార్డు కౌన్సిలర్ గుర్రం లావణ్య వార్డ్ ఇంచార్జ్ గుర్రం ప్రకాష్ ఆధ్వర్యంలో గోకుల్ నగర్, స్వరాజ్య నగర్ లలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు ప్రజలకు చేకూరుతుందో అడిగి తెలుసుకున్నారు. వార్డులో కావాల్సిన మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ముందుకు సాగారు డ్రైనేజీ రోడ్లు పలు సమస్యలపై ఎమ్మెల్యేను అడగగా ఆయన వెంటనే స్పందించి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్టా బాలాజీ, అనిల్ కుమార్, షేక్ కమల్ భాష. జిలాన్, రాగా నరసింహారావు, వైసిపి నాయకులు 40 ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర రాయపు రెడ్డి, కంభం పాములేటి, డీలర్ ఆంజనేయులు, ఆచారి కాలని శివారెడ్డి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Comments