top of page

పంచాయతీ సమస్యలపై దృష్టి సారించిన సర్పంచ్ కొనిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 23, 2022
  • 1 min read

పది రోజుల్లో మీ సమస్యలన్నీ తీరుస్తా...

కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్ లో జగనన్న పల్లెబాట నిర్వహించిన సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి.

కొత్తపల్లె పంచాయతీ అమృతా నగర్ లో నెలకొన్న నీటి సమస్యను పది రోజుల్లో దగ్గరుండి పరిష్కరిస్తానని కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం అమృతా నగర్ లో ఉన్న 17, 18 , 19 వార్డుల్లోని మడూర్ రోడ్డు లో ఉన్న వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు సర్పంచ్ దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. కొత్తగా వేసిన పైప్ లైన్ ద్వారా కొలాయిలు ఇంటింటికి ఏర్పాటు చేశారని, అయితే నీరు సరిగా రావడంలేదని సర్పంచ్ కొని రెడ్డి దృష్టికి తీసుకురాగా, సర్పంచ్ వాటర్ వర్క్స్ సిబ్బంది కి ఫోన్ చేసి సమస్యపై ఆరా తీశారు. సచివాలయ కార్యదర్శి కి ఫోన్ చేసి మాట్లాడారు. అడ్డరోడ్లలో పెరిగిన జంబు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, విష సర్పాలు చేరి ప్రజలకు కాటు వేస్తున్నాయని అయినా సచివాలయ ఉద్యోగులు ఎవరు స్పందించలేదని ఫిర్యాదు చేశారు. అడ్డ రోడ్లు వేయడానికి కోటి రూపాయల నిధులు ఉన్నాయని త్వరలో పనులు ప్రారంభిస్తామని సర్పంచ్ వివరించారు. సోమవారం హిటాచి పంపించి దగ్గర ఉండి జంబును తొలగిస్తామని తెలిపారు. వీధిలైట్లు తన సొంత నిధులతో తెప్పించామని వెంటనే వాటిని వేయించాలని సిబ్బందికి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యమ్మ, వార్డు మెంబర్లు తిరుపాల్రెడ్డి , మోష, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page