top of page

అగ్నిపర్వతం సినిమా చూపిస్తూనే బ్రెయిన్ సర్జరీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 4, 2022
  • 1 min read

🔥అగ్నిపర్వతం సినిమా చూపిస్తూనే బ్రెయిన్ సర్జరీ

ఆంజనేయులు అనే రోగికి న్యూరో సర్జన్‌లు మత్తు ఇవ్వకుండానే కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా చూపిస్తూ మెదడు ఆపరేషన్ పూర్తి చేశారు. గత నెల 25న ఈ అరుదైన సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్‌ కావడం, రోగి త్వరగానే కోలుకోవడంతో డిసెంబర్‌ 3వ తేదిన డిశ్చార్జ్ చేశారు.

డాక్టర్లను ప్రాణం పోసే దేవుళ్లంటారు. కొంత మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేసే విధానం చూస్తే ఈ మాట నూటికి నూరు శాతం కరెక్ట్ అనిపిస్తుంది. మెదడులో కణతి తొలగించడానికి మత్తు ఇవ్వకుండా చేయాల్సిన సర్జరీని గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కాలు, చెయ్యిని ప్రభావితం చేసే మెడదులోని నరాలు దెబ్బతినకుండా సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా చూపిస్తూ ఆపరేషన్‌ చేశారు డాక్టర్లు. సర్జరీ సక్సెస్‌ కావడంతో రోగి బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page