బస్టాండ్లో బాలికకు తాళి కట్టిన బాలుడు (వీడియో)
- EDITOR

- Oct 12, 2022
- 1 min read
బస్టాండ్లో బాలికకు తాళి కట్టిన బాలుడు (వీడియో)
తమిళనాడు చిదంబరం జిల్లా గాంధీ విగ్రహం సమీపంలోని బస్టాండులో ఇటీవల విస్మయకర ఘటన జరిగింది. ఇంటర్ చదివే అమ్మాయికి, పాలిటెక్నిక్ చదివే అబ్బాయి తాళి కట్టేశాడు.ఇద్దరూ మైనర్లే. అవగాహన లేకుండా వారు చేసిన పని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఉద్దేశపూర్వకంగా చేశారో, సరదాగా చేశారో తెలియదు కానీ వీరి వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై పోలీసులు స్పందించారు. వారిద్దరిపై కేసు నమోదు చేశారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments