రేషన్ వాహనం ఢీకొని విద్యార్థి మృతి
- VOICE OF HERALD

- Feb 11, 2022
- 1 min read
శ్రీకాకుళం, కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామంలో మిత్రులతో కలిసి ఆటలాడుకుంటున్న బాలుడిని రేషన్ వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడు. కుమారుడు సత్యనారాయణ మృతితో తండ్రి తాపీమేస్త్రి శ్రీను కన్నీరుమున్నీరుగా విలపించాడు.కాగ బాలుడు కొబ్బరిచెట్ల పేట సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Comments