top of page

పులివెందుల లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 26, 2022
  • 1 min read

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలోని, పెనికేరు గ్రామానికి చెందిన ప్రముఖ శెట్టిబలిజ నాయకురాలు, కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ శెట్టిబలిజ వైసిపి రాష్ట్రస్థాయి మహిళ నేత, మరియు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వనుము సత్య కళ్యాణి పులివెందులలో ఈ రోజు పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాల్లో పలువురు పెద్దలతో, నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పులివెందుల మార్కెట్ యార్డ్ బిల్డింగ్ కార్యాలయం వద్ద రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో, పలువురు ప్రముఖ నాయకులుతో జాతీయ జెండాకు వందనం సమర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటమునకు, పలువురు దేశనాయకులకు, స్వాతంత్ర సమరయోధులకు, వారంతా కలిసి వందనములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను కలిసి ఆమె పాదాలకు నమస్కరించారు. అనంతరం కడప వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటు, పలువురు ప్రముఖ నేతలను కలిసి వారికి ధన్యవాదాలు తెలిపారు, పలువురు వైసిపి పార్టీ ప్రముఖులను, సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబమునకు చెందిన పలువురు పెద్దలు ఆశీర్వాదాలు పొంది, వారి కుటుంబంలో ఒక ఆడబిడ్డగా, ఎంతో సన్నిహితంగా వారి ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులంతా ఒక శెట్టిబలిజ జాతి ఆడబిడ్డ అయిన ఎంతో గౌరవ మర్యాదలతో వారంతా ప్రేమాభిమానాలు పంచినారని, వారి రుణం తీర్చుకోలేనిది అని ఎంతో ఆనందంతో, సంతోషంతో వనము సత్య కళ్యాణి శెట్టిబలిజ ప్రముఖ మహిళ నేత వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేశారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page