top of page

ఆస్తి కోసం వదినను చావబాదిన మరదల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 6, 2022
  • 1 min read

ఆస్తి కోసం వదినను చావబాదిన మరదల్లు... వదిన పరిస్థితి విషమం...


శ్రీకాకుళం జిల్లా

రణస్థలం మండలంలోని పెద్ద పిసిని గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య చెలరేగిన ఆస్తి తగాదాల నేపథ్యంలో, రెడ్డి కమల అనే మహిళన తన ఇద్దరు ఆడపడుచులు రెడ్డి జానకి, కొత్తకోటల సుశీల లు కర్రలతో చావబాదారు. బాధితురాలు కమలను శ్రీకాకుళం రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకృతి లేఔట్ లోనే 40లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిని తాజాగా అమ్మకాలకు జరిపారు. ఈ క్రమంలో వాటాను అన్నా వదినలు అడగడంతో ఇవ్వడం ఇష్టం లేక, వదిన అయినా రెడ్డి కమల ను కర్రల సాయంతో విచక్షణారహితంగా చావబాదారు. ప్రస్తుతం వీరిని ఆర్.పురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page